ప్రభుత్వం వెంటనే దిగి రావాలి

మోకాళ్లపై నిరుచుని వినూత్న నిరసన
____________________________________________గాంధారి జనంసాక్షి ఆగస్టు 23
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని తమ  సమస్యలను పరిష్కరించాలంటూ గత నెల రోజులుగా వీఆర్ఏలు చేస్తున్న సమ్మె కు స్పందించి ప్రభుత్వం వెంటనే దిగి రావాలని వీఆర్ఏ జేఏసీ జిల్లాకు కన్వీనర్ కాశీరాం డిమాండ్ చేశారు. మంగళవారంతో విఆర్ఎల సమ్మె 30వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వీఆర్ఏలు మోకాళ్లపై నిలుచుని నిరసన తెలియజేశారు. నినాదాలు చేస్తూ ప్రభుత్వం స్పందించాలన్నారు. గాంధారి మండలంలో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వద్ద ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల కనుగుణంగా వెంటనే జీవోలను విడుదల చేయాలన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించామని, ఇకనుంచి అలాంటి పరిస్థితులు ఉండవని అన్నారు. రాబోయే రోజుల్లో తమ నుంచి ప్రభుత్వానికి ప్రతిఘటన ఎదురవుతుందన్నారు. రెవిన్యూ వ్యవస్థలో 24 గంటలు పని చేసే వీఆర్ఏల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు. లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గాంధారి మండల ప్రధాన కార్యదర్శి సాయిలు, ఉపాధ్యక్షుడు గంగారాం, కోశాధికారి సర్దార్, వీఆర్ఏలు పాల్గొన్నారు.

తాజావార్తలు