ప్రభుత్వం వెంటనే దిగి రావాలి లేదంటే అసెంబ్లీ ముట్టడిస్తాం..

 

వీఆర్ఏ జేఏసీ జిల్లా చైర్మన్ బెజ్జం భరత్ కుమార్

 

కేసముద్రం ఆగస్టు 26 జనం సాక్షి / గత 33 రోజులగా తాము చేస్తున్న నిరవధిక సమ్మెకు ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని వీఆర్ఏ జేఏసీ జిల్లా చైర్మన్ బెజ్జం భరత్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో వీఆర్ఏల పే స్కేల్ కోసం 48 గం. మహాధర్నా ధూమ్ ధామ్ నిర్వహించారు.ఈ ర్యాలీకి జిల్లాలోని 16 మండలాల నుంచి భారీ సంఖ్యలో వీఆర్ఏలు కదంతొక్కారు.జిల్లా కేంద్రంలో వీఆర్ఏలు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ ఇకనైనా ప్రభుత్వం దిగి రాకుంటే రాష్ట్ర జేఏసీ తరఫున అసెంబ్లీతోపాటు ప్రగతి భవన్ ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు హామీలు ఇచ్చారని వాటిని నెరవేరేచాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు.33 రోజులుగా నిరవదిక సమ్మె చేస్తున్న వీఆర్ఏల సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తుందని ఇది మానుకోవాలన్నారు.వెంటనే తమ డిమాండ్లు అమలు చేస్తూ జీవోలను జారీ చేయాలన్నారు. వీఆర్ఏలతోనే తహసిల్ కార్యాలయం తో పాటు ఆర్డిఓ, కలెక్టరేట్లలో కూడా తాము కీలక భూమిక పోషిస్తున్నామన్నారు. అలాంటిది తమను నిర్లక్ష్యం చేయడం తగదని హితవు పలికారు.కార్యక్రమంలో జిల్లా కో చైర్మన్ శ్రీవాత్సవ , జనరల్ సెక్రెటరీ దుగుంట్ల శ్రీనివాస్, కన్వీనర్ సతీష్, ప్రభాకర్ ,కో కన్వీనర్ లు దామోదర్, మధుసూదన్,రవీందర్,చంద్రశేఖర్, జుంకిలాల్,చైతన్య,వెంకన్న,అన్ని మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు,వీఆర్ఏలు పాల్గొన్నారు.