ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా రుణాలు

కరోనా సంక్షోభాన్ని అధిగమించేలా చర్యలు
ముంబై,ఆగస్ట్‌7(జనంసాక్షి):కరోనా వైరస్‌ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. దీంతో సామాన్యులకు ఆర్థిక కష్టాలు తప్పట్లేదు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటివారికి ఓ గుడ్‌ న్యూస్‌. ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.5,00,000 వరకు పర్సనల్‌ లోన్స్‌ ఇస్తున్నాయి. ష్యూరిటీ కూడా అవసరం లేదు. కోవిడ్‌ 19 సంబంధిత చికిత్సకు అయ్యే ఖర్చుల కోసమే బ్యాంకులు ఈ రుణాలు ఇస్తున్నాయి. కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా`తీసుకున్న కోవిడ్‌`19 కీలక నిర్ణయంలో భాగంగా బ్యాంకులు ఈ రుణాలు ఇస్తున్నాయి. కనీసం రూ.25,000 నుంచి గరిష్టంగా రూ.5,00,000 వరకు రుణాలు తీసుకోవచ్చు. వెంటనే చెల్లించాల్సిన అసరం లేదు. ఐదేళ్ల గడువు ఉంటుంది. ప్రాసెసింగ్‌ ఫీజు కూడా ఉండదు. మొదటి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఈఎంఐ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రుణాలకు వడ్డీ కూడా తక్కువ. 6.85 శాతం నుంచి వడ్డీ మొదలవుతుంది. వేతనాలు పొందే ఉద్యోగులు, వ్యాపారాలు చేసేవారు, పెన్షనర్లు కూడా ఈ లోన్‌ తీసుకోవచ్చు. తమకు లేదా తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కోవిడ్‌`19 సంబంధిత చికిత్స కోసం ఈ రుణాలకు దరఖాస్తు చేయొచ్చు. అయితే కోవిడ్‌ 19 పాజిటీవ్‌ వచ్చినట్టు రిపోర్ట్‌ ఇవ్వడంతో పాటు కోవిడ్‌ 19 చికిత్స కోసం ఎలా ఖర్చు చేయబోతున్నారన్న వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నియమనిబంధనలన్నీ అంగీకరించిన వారికే రుణాలు వస్తాయి. గత 12 నెలలుగా సంబంధిత బ్యాంకులోని అకౌంట్‌లో సాలరీ క్రెడిట్‌ కావాలి. ఇప్పటికే ఆ బ్యాంకులో రీటైల్‌ లోన్‌ తీసుకున్నవారు కూడా మళ్లీ ఈ రుణాలకు దరఖాస్తు చేయొచ్చు. వేతనాలు పొందని వారు సేవింగ్స్‌ లేదా కరెంట్‌ అకౌంట్‌ మెయింటైన్‌ చేస్తూ ఉండాలి. రెగ్యులర్‌గా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ పైల్‌ చేస్తూ ఉండాలి.

తాజావార్తలు