ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 13 (జనం సాక్షి);
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యము అందించేందుకు డాక్టర్లు అందరు అందుబాటులో ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
మంగళ వారం ఉదయం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ
సందర్భంగా ప్రతి వార్డు తిరుగుతూ రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో డాక్టర్లు వైద్యం ఎలా చేస్తున్నారు, వైద్యానికి వేచి ఉండాల్సిన సమయం ఎంత, మందులు బయటికి చీటి రాసి ఇస్తున్నారా అనే పలు రకాలైన ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు. ఒపి వార్డు, సర్జికల్ వార్డు, ఎ.యన్.సి. వార్డు, డయాలసిస్, ఐసియు ల తో పాటు లేబర్ వార్డును పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులు సరిగ్గా నిర్వహించాలని అందులో పేషంట్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా నమోదు
చేయాలని ఆదేశించారు. పరిశుభ్రత విషయములో చాలా మెరుగు పడాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. అనంతరం ఆసుపత్రిలో చిన్న పిల్లల వార్డును, వాటర్ ట్యాంకులను పరిశీలించారు. ఆసుపత్రిలో అత్యవసర వైద్య మందులు ఉన్నాయా అని ఆరా తీసారు. ఆరోగ్యశ్రీ క్రింద కేసులు నమోదు చేస్తున్నారా అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య మరింత పెంచాలని అందుకు నిబద్ధతతో పనిచేయాలని డాక్టర్ లకు ఆదేశించారు. అన్ని వైద్య సేవలు అందించగలిగేల సిద్దంగా ఉండాలని ఆదేశించారు.
ఆసుపత్రికి కావలసిన మౌళిక సదుపాయాలు, అత్యవసర పరికరాలు, మందుల కొనుగోలుకు సంబంధించిన విషయములో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రి లో పనిచేసే నర్సులు రోగులతో సౌమ్యంగా మాట్లాడి రోగులకు సేవలు అందించాలని , పరిసుబ్రత పాటించి సమయపాలన పాటించే విధంగా హెడ్ నర్స్ తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బయోమెట్రిక్ ద్వారా ప్రతి సిబ్బంది సమయానికి హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. రక్త పరీక్షలు ఆసుపత్రిలోనే నిర్వహించాలని, బయట వారు వచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకేళ్ళరాదని హెచ్చరించారు. మందులు సరిపడా రోగులకు అందజేయాలని బయటకు రాసివ్వకూడదని కలెక్టర్ తెలిపారు. సదరన్ క్యాంపులు నిర్వహించే ముందు దివ్యాంగుల వివరాలు కంప్యూటర్లో నమోదు చేసి వారికి పరీక్షల అనంతరం డాక్టర్ సంతకం తో సర్టిఫికెట్ అందజేయాలని ఆదేశించారు. గర్భిణీలకు కూర్చోవడానికి కుర్చీలు వేయించాలని వారు ఇబ్బందులు పడకుండా కలర్ టోకెన్లు అందజేయాలని కలెక్టర్ అన్నారు. ఐ సి యు, ఎస్ ఎన్ సి ఆక్సిజన్ పైప్ లైన్ నుండి మెయిన్ పాయింట్ కు పనులు పెండింగ్ ఉన్నవని వైద్య ఆరోగ్య శాఖాదికారి కలెక్టర్ దృష్టి కి తీసుకు రాగా పది రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేయిoచాలని ఈ ఈ జయపాల్ రెడ్డి కి ఆదేశించారు. డాక్టర్లు శోభ రాణి,హ్రుశాలిని, క్వాలిటీ మేనేజర్ రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.