ప్రభుత్వ ఆసుపత్రులలో పలు సమస్యలు పరిష్కరించాలని వినతి
పినపాక నియోజకవర్గం జూలై 5 (జనం సాక్షి): పినపాక నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిల పరికరాలు నిర్మాణ ,నిర్వహణకు సంబంధించిన సమస్యలను పరిష్కారించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును పినపాక ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వారి స్వగృహం హైదరాబాదులో కలిసి జిల్లాలోని పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో పేద ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ ఆస్పటల్ సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల మెరుగైన వాద్యం అందుతుందన్నారు. ఈ క్రమంలోని మణుగూరు,ఇల్లందు,అశ్వరావుపేట,హా స్పటల్ కి డయాలసిస్ సెంటర్స్ మంజూరు చేయాలని, అలాగే ఆళ్లపల్లి,జానంపేట హాస్పిటల్స్ 24 గంటల, సర్వీస్ అందించాలని అన్నారు. గుండాల హాస్పటల్లో పోస్టుమార్టం సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. మణుగూరు హాస్పటల్లో ఆధునిక పరికరాలను ఏర్పాటు కోసం 50 లక్షలు మంజూరు చేయాలని కోరారు. ఆళ్లపల్లి,కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రహరీ గోడ ,నిర్మించుటకు నిధులు తక్షణమే మంజూరు చెయ్యాలని విన్నవించడం జరిగింది. స్పందించిన మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు వారంలో సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.