ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్ర పటంను బహుకరించిన
బిజెపి నేతలు.
గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి కావడం చారిత్రాత్మకం.
బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై26(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో భారత నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ద్రౌపది ముర్ము చిత్రపటాన్ని బిజెపి మండలాద్యక్షు డు పదిర భీమేష్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ఎమ్మార్వో, ఎంపిడిఓ, పోలీస్ స్టేషన్ కార్యాలయాల్లో బహుకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన
బిజెపి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు కొల్లాపూర్ అసెంబ్లీ ఇంచార్జి ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ ఒక గిరిజన తెగకు చెందిన మహిళ ఈరోజు దేశానికి రాష్ట్రపతి కావడం నిజంగా ఒక చారిత్రాత్మకమని, గిరిజన తెగకు చెందిన మహిళను రాష్ట్రపతి గా ప్రకటించడం నిజంగా ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కిందని అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయడంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషి అమోఘం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎల్లేనితో పాటు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జలాల్ శివుడు, నాయకులు తమటం శేఖర్ గౌడ్,రోజారమణి, గువ్వలి వెంకటయ్య, భరత్ చంద్ర, లింగస్వామి, అమ్మపల్లి మల్లేష్, మార్కండేయ, జగదీష్, భరత్, శివ తదితర కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.