ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించండి. జెడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కి

పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి.
తాండూరు డిసెంబర్ 5 (జనం సాక్షి) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పిడిఎస్ యు వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ రెడ్డి సమక్షంలో జెడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
తాండూర్ పట్టణ కేంద్రంలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు 2500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో అత్యధికంగా బాలికలు ఉన్నారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపోను మూత్రశాలు మరుగుదొడ్లు లేక విద్యార్థినిలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాల ప్రహరీ గోడ సరిగా లేక ఆకతాయిలకు అడ్డగా మారింది. విద్యార్థినులకు రక్షణ లేకుండా ఉంది.  వెంటనే కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని
విజ్ఞప్తి చేశారు. కళాశాలలో తరగతులు గదులు, విద్యార్థులు కూర్చుకునే పరిస్థితి దాపురించింది కావున అటెండర్ ను స్లిప్పర్స్ స్కావెంజర్ నూ కూడా నియమించాలని జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తో పిడిఎస్ యు నాయకులు కోరారు. సమస్యలతో కూడిన వినతి పత్రం చూసిన వెంటనే జెడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి స్పందిస్తూ వెంటనే చర్యలు చేపట్టడం కోసం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సమస్యలన్నీ కూడా పరిష్కారిస్తానని విద్యార్థి నాయకులకు హామీ ఇచ్ఛారు.  వెంటనే స్పందించినందుకు జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కి పిడిఎస్ యు జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు నాయకులు ప్రకాష్ షోయబ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

తాజావార్తలు