ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను అభ్యసించండి
గ్రామాల్లో అధ్యాపకుల విస్కృత ప్రచారం

మహాదేవపూర్ జులై 19 (జనంసాక్షి)
ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహాదేవపూర్ అధ్యాపక బృందం కళాశాలలో చేరాలని , బ్రాహ్మణపల్లి, బేగ్లూర్ తదితర గ్రామలలో ఇంటర్ పాసైన విద్యార్థులకు దోస్త్ ద్వారా డిగ్రీ లో అడ్మిషన్ పొందవచ్చని . అందుబాటులో ఉన్న కాలేజ్ లో చేరడం వలన అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం సలహాలు,సూచనలు ,మంచి విశాలమైన వాతావరణం లో కళాశాల భవనం, క్రీడ ప్రాంగణం,డిజిటల్ విద్య,విద్యార్థుల్లో సృజనాత్మకత ను వెలికితీయడం లాంటివి కళాశాలలో చేరడం వలన కలిగే ప్రయోజనాలు ,సౌకర్యాలు, భవిష్యత్ కు బంగారు బాట వేసుకోవచ్చని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు విపులంగా వివరించారు..ఈ యొక్క ప్రచారంలో అధ్యాపకులు జి. రమేష్ , టి.రజిత, డా. పోరిక రాజు, డా.డి .శ్రీనివాస్, వి. రమేష్, ఆశ్ర సుల్తానా తదితరులు పాల్గొనడం జరిగింద