ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ప్లాంట్, స్టేషనరీ వితరణ

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జి. ఎస్. ఆర్. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, రామకృష్ణాపూర్ సింగరేణి ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ రాజా రమేష్ బాబు నెన్నల్ మండలం జంగల్ పెట్ ప్రభుత్వ పాఠశాలకు మినరల్ వాటర్ ప్లాంట్, విద్యార్థులకు స్టేషనరీ, నోట్ బుక్స్, వాటర్ బాటిల్స్ అందించారు. జి ఎస్ ఆర్ ఫౌండేషన్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను చూసి రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రేణుక నెన్నేల్ మండల్ లో గల తమ ప్రభుత్వ జంగల్ పేట్ పాఠశాలకు ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్ కావాలని కోరగా వెంటనే స్పందించిన డాక్టర్ రాజా రమేష్ బాబు పాఠశాలకు వెళ్లి పాఠశాలకు సుమారు 50 వేల రూపాయల విలువగల మినరల్ వాటర్ ప్లాంట్ తో పాటు 60 మంది విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు, బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ బాటిళ్లు తన సోదరి సురేఖ రాజ్ జ్ఞాపకార్థం విద్యార్థులకు అందించారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు సేవ చేయాలనే దృక్పథంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కావలసిన వసతులను కల్పించడం ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఉన్నత స్థానాలలో ఉండాలని అన్నారు. విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని అందించే వాటర్ ప్లాంట్ ను బహుకరించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. స్థానిక ఎంపీటీసీ, సర్పంచ్ ,ఉప సర్పంచ్లను సన్మానించారు. మన్నెగూడ ప్రభుత్వ పాఠశాలలో సైతం సుమారు 30 మంది విద్యార్థులకు స్టేషనరీ, నోట్ బుక్స్ అందించారు. పాఠశాలకు ముఖ్య అతిధులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు జలంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగిపెల్లి రాజేశం, ఉపాధ్యాయురాలు గుండ్ల మాధవి,ఎంపీటీసీ గొలుసుల శిరీష, సర్పంచ్ రావుల సత్యనారాయణ , ఉప సర్పంచ్ చిలుకయ్య, గ్రామ పెద్దలు రావుల శ్రీనివాస్, జిఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు రమేష్ కన్నా, నరెడ్ల వెంకన్న, బద్రి సతీష్, వేణు, శశి, పిట్టల శ్రీకాంత్, పప్పు రాజు, రావుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.