ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కొరత.

టాయిలెట్లు లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు.
చెప్పుకోలేని వ్యథ..
రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి) ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినా వాటిని ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాల్లేవు.ఇప్పటికీ చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఉన్న కొన్నిచోట్ల నిధులు లేమితో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు చెప్పుకోలేని వ్యథను అనుభవిస్తున్నారు.కనీస వసతులైన వురుగు దొడ్లు, వుంచినీరు లేక నానా అవస్థలు పడుతున్నారు.ఇలాంటి సంఘటన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలంలో దర్శనం ఇస్తున్నాయి. పాఠశాలలో మరుగుదొడ్లు లేక పక్కనే ఉన్న గోడ దూకి అస్పత్రిలోకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.ఇప్పటికైనా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి టాయిలెట్లను నిర్మించాల్సిందిగా ప్రజలు, స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు..