ప్రభుత్వ భూమిని మాయం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు
జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వివేకానంద యూత్ సభ్యులు
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాయం చేశారని వారి చెర నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది వివరాల్లోకి వెళితే.. యాచారం మండల పరిధిలోని అయ్యవారిగూడెం గ్రామం రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 970 లో గల ప్రభుత్వ భూమిని దాని పక్కనే ఉన్న 101 ఫార్మా ఎలైట్ వెంచర్ యజమానులు డి.టి.సి.పి లే అవుట్ ను అడ్డుపెట్టుకొని అతి విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఈనెల 3వ తేదీన అయ్యవారిగూడెం గ్రామంలోని వివేకానంద యూత్ సభ్యులు నక్క విజేందర్ నక్క నరసింహ వి కిరణ్ కుమార్ నక్క మహేందర్ మండలి గోపాల్ ఏం వెంకటేష్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
101ఫార్మా ఎలైట్ నామ్స్ ప్రకారం 10% గ్రామపంచాయతీకి ఇవ్వాలి అట్టి భూమిని గ్రామపంచాయతీ అభివృద్ధికి కేటాయించాలి కానీ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కి కేటాయించ లేదుఅని కేటాయించిన భూమిని రిజిస్ట్రేషన్ చేయలేదని తెలిపారు. దాని ప్రక్కనే ఉన్న సర్వే నెంబర్ 970 లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని 101 వెంచర్ యజమానులు అక్రమించుకున్నారని ఆక్రమించుకున్న భూమిని కాపాడాలని పలుమార్లు తాసిల్దార్ కి ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని నామమాత్రంగా చర్యలు తీసుకున్నారని చెప్పారు. అధికారుల ఉదాసీనతతో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరపట్టారని ఇప్పటికైనా గ్రామపంచాయతీ కి 10% కేటాయించిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని చెర పట్టిన రెండు ఎకరాలను కాపాడాలని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.