ప్రభుత్వ లాంఛనాలతో రాఘవరెడ్డి అంత్యక్రియలు

3

నల్గొండ,ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) :

కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం సీనియర్‌ నాయకులు నర్రా రాఘవరెడ్డికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్‌, సిపిఎం నాయకుడు రాఘవులు, తమ్మినేని వీరభద్రం, జూలకంగా రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వంగాల స్వామిగౌడ్‌ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తదితరులు ఆయన భౌతికి కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌, జానాలు మాట్లాడుతూ నర్రా రాఘవరెడ్డి అలుపెరుగని యోధుడన్నారు. ఆయన ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేశారన్నారు. ఆయన జిల్లాకు గర్వకారణంగా నిలిచారని, సామాన్యుల గళం అసెంబ్లీలో వినిపించారన్నారు. ఆయన మృతి తమకు తీరని లోటన్నారు. రాఘవులు తదితరులు మాట్లాడుతూ రాజీలేని పోరాటయోధుడు నర్రా అన్నారు. ఆయన పుచ్చలపల్లి తరవాత అంతటి నాయకుడన్నారు.  నర్రా రాఘవరెడ్డి(92) అనారోగ్యంతో గురువారం సాయంత్రం  మృతి చెందారు. అభిమానుల సందర్శనార్థం నర్రా పార్థీవ దేహాన్ని నల్గొండ జిల్లా సీపీఎం కార్యాలయంలో ఉంచారు. నర్రా భౌతికకాయానికి సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు, కేంద్రకమిటీ సభ్యుడు వి.శ్రీనివాస్‌ రావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించారు. సుందరయ్య తర్వాత నర్రా

రాఘవరెడ్డి గొప్ప వ్యక్తి. నర్రా లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. నీతికి, నిజాయితీకి రాఘవరెడ్డి నిలువెతు నిదర్శనం. పార్టీకి ఆయన గొప్ప సేవలు అందించారని రాఘువులు నివాళులు అర్పించారు. నర్రా రాఘవరెడ్డి ఆశయాల కోసం కృషి చేస్తాం. నల్గొండ జిల్లానే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. నీతి, నిజాయితీలకు మారుపేరు. పేదల తరపున పోరాడేవారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలను నిర్వహించాని తమ్మినేని అన్నారు.

నర్రా రాఘవరెడ్డి సామాన్యమైన జీవితం గడిపారు. నిరాడంబరుడు. 1985 లో మొట్టమొదటగా యువజనోత్సవాలు నిర్వహించినప్పుడు ఆయన శ్రమించి.. యూత్‌ ను సవిూకరించారు. పెద్ద ఎత్తున యువతీయువకులను సవిూకరించారు. ఆయనతో కలిసి.. ఊరూర తిరిగాను. అతి తక్కువతో ఖర్చుతో ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ఆయను నుంచి నేర్చుకోవచ్చు. 1992 నుంచి 2002 వరకు పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ లో పక్కపక్కనే ఉండే వారం. వృద్ధాప్యంలో కూడా యూత్‌ గా ఉన్నారు. అత్యుత్తమ రాజకీయ సంస్తృతికి ఆయన నిలువెత్తు నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజలకు ఎంతో ఉత్సహాన్ని ఇచ్చారని వి.శ్రీనివాస్‌ రావు నివాళి అర్పించారు.  అంతిమయాత్రలో సీపీఎం పొలిట్‌ బ్యూరో బివి.రాఘవులు, కేంద్రకమిటీ సభ్యుడు వి.శ్రీనివాస్‌ రావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.. తమ్మినేని వీరభద్రంలు పాల్గొన్నారు. వాహనం ముందు భాగాన రెడ్‌ షర్ట్‌ వాలంటీర్లు కవాతు నిర్వహించారు. ద్విచక్ర, ఫోర్‌ వీలర్స్‌ తో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రియతమ నేత నర్రా రాఘవరెడ్డిని కడసారి చూసేందుకు నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎన్‌ టిర్‌ కూడా నర్రా రాఘవరెడ్డికి అమితమైన గౌరవం ఇచ్చేవారని నేతలు గుర్తు చేసుకున్నాన్నారు. జిల్లా ప్రజాతంత్ర ఉద్యమానికి ఆయన దిక్సూచి… ఆయన విజ్ఞాన గని…అని కొనియాడారు. నకిరేకల్‌ పార్టీ కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థీవదేహాన్ని ఉంచారు. అనంతరం ఆయన స్వగ్రామం వట్టిమర్తికి తరలించి.. అక్కడ కొంత సమయం ఉంచి.. అక్కడి నుంచి వట్టిమర్తి గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు తమ్మినేని వీరభద్రం, రాఘవులుతోపాటు ఇతర రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 12వ తేదీ వరకు సంతాప దినాలను పాటించి గ్రామ గ్రామాన సంతాప సభలు నిర్వహిస్తామని తెలిపారు.