ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు  ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో విద్యాసంస్థల బంద్ ను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యసంస్థలు ప్రారంభమై నేటికీ నెలరోజులు కావస్తున్న ఖాళీగా ఉన్న టీచర్స్ పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థులకు ఇవ్వాల్సిన పుస్తకాలు ఇవ్వకుండా కొద్ది పుస్తకాలతో  విద్యార్థులకు ఏ విధంగా నాణ్యమైన విద్య అందిస్తారని ప్రశ్నించారు.విద్యార్థులకు దుస్తులు కూడా ఇవ్వలేదన్నారు. , రాష్ట్ర వ్యాప్తంగా  ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా సరైన విద్య ఎలా అందిస్తారని ప్రశ్నించారు.ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజుల దోపిడీని నియంత్రించాలని,ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాస్ ఇవ్వాలన్నారు.పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలన్నారు.విద్యార్థి వ్యతిరేక నూతన జాతీయ విద్యా విధానం 2020 ను రద్దు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి  మహేష్ , పోలేబొయిన కిరణ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీకాంత్ వర్మ , ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపగాని రవి,పీడీఎస్ యు
జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area