ప్రభుత్వ విద్య మరింత బలోపేతం * నాణ్యమైన విద్య సిఎం కెసిఆర్ లక్ష్యం * వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటం ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయల నిధులు కేటాయించి, మన ఊరు- మన బడి పథకాన్ని అమలు చేయటం జరుగుతుందని తెలిపారు. మండల పరిధిలోని పడమట నర్సాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు, మన బడి కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని విద్యార్థులు ప్రయోజకులు కావాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు, మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టు తెలిపారు. విద్యాభివృద్ధి కోసం తన వంతు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్రం మోహన్ రావు, పాపకొల్లు సర్పంచ్ లక్ష్మి, బేతాళపాడు సర్పంచ్ గుగులోతు రాందాస్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ యదళ్లపల్లి వీరభద్రం, తహశీల్దార్ లూధర్ విల్సన్, ఎండీవో రవి, ఎంఈవో వెంకట్, ఇంజనీర్లు నాగేందర్, రఘురామయ్య, రాంకుమార్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, కార్యదర్శి నున్న రంగారావు, నాయకులు రోకటి సురేష్, కాజా రమేష్, రామిశెట్టి రాంబాబు, మల్లెల నాగేశ్వరరావు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.