ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి
మండల కోఆప్షన్ సభ్యుడు జుబేర్
చౌడాపూర్,డిసెంబర్ 18(జనం సాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటును కల్పించాలని స్వయం సంకల్ప కృషితో మైనార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఎకనామిక్స్ సపోర్ట్ స్కీం కింద బ్యాంకు సబ్సిడీ లోన్లు 2022-23 కు గాను ఇవ్వనందని ఇట్టి సదా అవకాశాన్ని కులకచర్ల మరియు చౌడాపూర్ మండల మైనార్టీ ప్రజలు సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా ఎదగాలని మండల మైనార్టీ ప్రజలకు మండల కో ఆప్షన్ సభ్యులు జుబేర్ తెలియజేశారు.ఈ సదవకాశం డిసెంబర్ 19 మంచి జనవరి 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.