ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తున్నాం: ఎమ్మెల్యే

కొత్తగూడెం,జూలై4(జ‌నం సాక్షి ): సర్కారు బడుల్లో నాణ్యమైన, మెరుగైన విద్య అందుతోందని, తెలంగాణలోవిద్యారంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని ట్రైకార్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ విద్య బలోపేతం దిశగా చర్యలు తీసుకున్నారని అన్నారు. ప్రైవేటు నుంచి సర్కారు బడుల్లో సీట్లు పొందేందుకు పోటీపడుతున్నారని, సర్కారు బడుల్లో ఏ విధంగా విద్యాబోధన సాగుతున్నదో అర్థం చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు మరింత జ్ఞానాన్ని పెంచుకునేందుకు సర్కారు బడుల్లో డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వ వసతులను విద్యార్థులు వినియోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. విద్యా ప్రగతిలో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉందనీ, మైనార్టీ, గురుకుల, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలను ఏర్పా టు చేసి మంచి విద్యను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ కు దక్కుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. పాఠశాలలో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేవని, మరుగుదొడ్ల నిర్వహణకు నీటి సౌకర్యం లేదని అనేక ఫిర్యాదుఉల వస్తున్నాయని, అందుకు అనగుణంగా అదనపు తరగతి గదులు ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.