ప్రమాణ స్వీకారానికి రండి
ప్రధానికి ముఫ్తీ ఆహ్వానం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి27(జనంసాక్షి): జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీకి పీడీపీ చీఫ్ ముఫ్తీ మహ్మద్ సయీద్ ఆహ్వానాన్ని అందించారు. జమ్మూకశ్మీర్ సీఎంగా ముఫ్తీ మహ్మద్ సయీద్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఫ్తీ మాట్లాడుతూ జమ్మూలో బీజేపీకి, కశ్మీర్‌లో పీడీపీకి ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించిందని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని తెలిపారు. ప్రధానితో శుక్రవారం పీడీపీ చీఫ్ సమావేశమయిన విషయం తెలిసిందే. రాస్ట అభివృద్ది లక్ష్యంగా తాము కలసి ముందుకు సాగుతామని అన్నారు.