ప్రముఖ న్యూరో సర్జన్ వైద్యుడుగా కీర్తి ప్రతిష్టలు తెచ్చిన నల్లమల వాసి.
డాక్టర్ హేమంత్ కుమార్.
అచ్చంపేట ఆర్సీ ,సెప్టెంబర్20,(జనం సాక్షి న్యూస్ ) : సామాన్య మధ్య తరగతి కుటుంబం నుండి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ గా ఎదిగిన నల్లమల వాసి. మండల పరిధిలోని నడింపల్లి గ్రామానికి చెందిన సత్యం పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ ఏఇ గా విధులు నిర్వహిస్తు అచ్చంపేట పట్టణంలో స్థిరపడ్డారు. భార్య పద్మ గృహిణి వీరి కుమారుడు హేమంత్ కుమార్ అచ్చంపేట పట్టణంలో గౌతమి పాఠశాలలో 1వ తరగతి నుండి 10వరకు చదుకొని 2006 పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి 2007,2008 లో హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ ద్వారా ర్యాంకు పొంది ఎంబిబిఎస్ లో సీటు సాధించారు. 2009లో కామినేని మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కాలేజీ నార్కట్ పల్లి లో ఎంబిబిఎస్ విద్యా సంవత్సరం పూర్తి చేశాడు. అనంతరం 2016 నుండి 2019 వరకు చల్మేడ ఆనందరావు మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కాలేజీలో జనరల్ మెడిసిన్ పూర్తి చేసి 2019 నుండి2022వరకు గుంటూరు మెడికల్ కాలేజీలో డిఎం, మెదడు నరాల స్పెషలిస్ట్ వైద్య నిపుణులు గా కోర్సును పూర్తి చెయ్యడం జరిగింది.ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. సాధారణ నాయి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ప్రతిభ కనబరుస్తూ న్యూరాలజీ డాక్టర్ గా ఉన్నత స్థాయికి ఎదగడం పట్ల తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు, హర్షం వ్యక్తం చేస్తున్నారు.