ప్రళయంలో సిఎం కోట్టుకుపోతారు:టిఆర్‌ఎస్
హైదరాబాద్:టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సృష్టించే ప్రళయంలొ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోట్టుకుపోతారని ఆపార్టీ నేత జగదీశ్వర రెడ్డి హెచ్చరించారు. నామినేటేడ్ సిఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలలోకి వెళితే కాంగ్రేస్‌కు తగిన బుద్ధి చెబుతున్నారు. తెలంగాణ మంత్రులు దద్దమ్మలు కనకే సీఎం వ్యాఖ్యలకు మద్దతిస్తున్నారని విమర్శించారు. బయ్యారపై సీఎం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లాలో చేయుతలపెట్టిన బంద్‌ను మే 3వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు.