ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :
వైద్య విద్యలో ప్రవేశాలకు జరిగిన జాతీయ ప్రవేశ అర్హత పరీక్ష ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు సిటీ కోఆర్డినేటర్, వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాల (సి బి యస్ ఇ) అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ టి.లలిత కుమారి తెలిపారు.విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్దేశించిన సమయం ప్రకారం విద్యార్థులు వారి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారని వెల్లడించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 6 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 3775 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉండగా 3671 మంది విద్యార్థులు హాజరైనట్లు 104 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు సిటీ కోఆర్డినేటర్ తెలిపారు.జాతీయ అర్హత పరీక్ష నీట్ ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగియడానికి తోడ్పాటును అందించిన జిల్లా యంత్రాంగానికి, పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, ట్రాఫిక్ పోలీస్ శాఖ, మీడియా వారికి,ఫ్లైయింగ్ స్క్వాడ్స్, అబ్జర్వర్స్ మరియు పరీక్షా నిర్వహణలో పాలుపంచుకున్న ఇతర సిబ్బందికి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ టి.లలిత కుమారి ధన్యవాదాలు తెలియజేశారు.