ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశికం
నిజామాబాద్,మే15(జనంసాక్షి): ప్రాదేశిక పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు అన్నారు. ఎన్నికలు నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులు, ఉద్యోగులు,
ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. వేల సిబ్బంది విధులు నిర్వహించారని, రెండు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. పోలింగ్ కేంద్రాలోల సిబ్బందికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశామని, ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో కనీస సదుపాయాలైన టెంట్లు, చల్లని తాగునీరు, దివ్యాంగులైన ఓటర్లకు వీల్‌చైర్స్, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలను దృష్టితో పెట్టుకొని అటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా పోలీస్ బందోబస్తుతో పాటు లైవ్ వెబ్‌కాస్టింగ్, కొన్ని చోట్ల వీడియో రికార్డింగ్ ఏర్పాటచేశామన్నారు. పోలింగ్ పర్యవేక్షణకు మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు..