ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులను పరిశీలించిన
– మాజీ పీసీసీ చీఫ్ డిఎస్
నిజామాబాద్, అక్టోబర్ 8 : ప్రాణహిత- చేవెళ్ల్ల పనులను పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ సోమవారం నాడు నిజామాబాద్ మండలం మొదట్‌పల్లి గ్రామంలో పనులను పరిశీలించారు. ఎత్తిపోతల పథకం పనులు పూర్తవుతే జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని అన్నారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని గుర్తు చేశారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గంగాధర్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశవేణు, పిసిసి కార్యదర్శి రత్నకర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నగేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.