ప్రాథమిక విద్య బలోపేతమే తొలి మెట్టు లక్ష్యం.

 

డీఈవో గోవిందరాజులు.
స్కూల్ కాంప్లెక్స్ స్థాయి ఉపాధ్యాయులకు తొలిమెట్టు శిక్షణ తరగతులు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్15(జనంసాక్షి):

ప్రాథమిక విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు డీఈవో గోవిందరాజులు తెలిపారు.గురువారం నాగర్ కర్నూల్ భవిత కార్యాలయంలో నాగర్ కర్నూల్ తాడూరు మండలాల స్కూల్ కాంప్లెక్స్ స్థాయి ఉపాధ్యాయులకు తొలిమెట్టు కార్యక్రమంలో శిక్షణ తరగతులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిఇఓ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ….
ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల మౌలిక భాష, గణిత సామర్థ్యాలను పెంపొందించ డంలో కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు కృషి చేయా లన్నారు. తొలిమెట్టు కార్యక్రమం పర్యవేక్షణ పకడ్బందీగా చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం, మౌలిక గణిత భావనలు తప్పనిసరిగా నేర్పించాల్సిన బాధ్యత ఆయా ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న తొలిమెట్టు కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.
విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించ డంలో తొలిమెట్టు కీలక భూమిక పోషిస్తుంది అన్నారు.ప్రభుత్వం రూపొందించిన టాంజిరిన్‌ యాప్‌ను ప్రతి ఒక్కరు తమ మొబైల్‌లో డౌన్‌లోడు చేసుకొని దాని ద్వారా పర్యవేక్షణను చేయాలన్నారు. ఈ యాప్‌ వినియోగంలో ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా శిక్షణను వినియోగించుకోవాలన్నారుఈ కార్యక్రమం లో మండల విద్యాధికారి చంద్రశేఖర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కురుమయ్య తిరుపతయ్య పర్వత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, తాడూరు నాగర్ కర్నూల్ మండలాల సీఆర్పీలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.