ప్రారంభమైన సాఫ్ట్‌స్కిల్స్
మార్కాపురం, జూలై 18: స్థానిక డాక్టర్ శామ్యూల్ జార్జి ఇంజనీరింగ్ కళాశాల నందు జెకెసి నిర్వహిస్తున్న రెండు రోజుల సాఫ్ట్‌స్కిల్స్ వర్క్‌షాపును కళశాల సెక్రటరీ డాక్టర్ ఎ సతీష్, ప్రిన్సిపల్ డాక్టర్ కెవిఎస్ నారాయణలు ప్రారంభించారు. ఉద్యోగ సాధనలో, పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలవాలంటే సబ్జెక్టు నాలెడ్జ్‌తోపాటు సాఫ్ట్‌స్కిల్స్‌లో నైపుణ్యం ఉంటే రాణించగలుగుతారని వారన్నారు. కళాశాల మిలనీయం ఆడిటోరియంలో బుధవారం ప్రారంభమైన ఈ వర్క్‌షాప్‌లో జెకెసి సీనియర్ సాఫ్ట్‌స్కిల్స్ ట్రైనర్ ఆర్‌వివి దత్తు కమ్యూనికేషన్ స్కిల్స్, వాటి ప్రాధాన్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచుకోవడానికి అవసరమైన సలహాలు, సూచనలతో పాటు రెగ్యులర్‌గా వినడం, రాయడం, చదవడం మరియు మాట్లాడటానికి సంబంధించిన మెళకువలను విద్యార్థులకు వివరించారు. ఉద్యోగ సాధనలో అతిముఖ్యమైన ఇంటర్వ్యూ, వీడియో క్లిప్పింగ్స్ ద్వారా సులభ పద్దతిలో వివరించారు. ఈ కార్యక్రమంలో రెండవ సంవత్సరం మరియు ఫైనల్ ఇయర్ విద్యార్థులు వంద మంది పాల్గొన్నారు. రెండవ రోజు కూడా ఈ వర్క్‌షాపు రెండవ సంవత్సరం విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ రాజాబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లేస్‌మెంట్ సెల్ స్బింది ప్రొఫెసర్ కె పాల్, జెకెసి మెంటర్ వివిధ విభాగాధిపతులు మరియు డిపార్ట్‌మెంటల్ తదితరులు పాల్గొన్నారు.