ప్రిసమ్ పాఠశాలకు నోటీసులు జారీ చేసిన డిఇఒ.

పాఠశాల బస్సులను సీజ్ చేసిన ఆర్టీవో.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,23(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రిసమ్ ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన బస్సులో 45 సామర్థ్యాన్నికి ఉండగా 100 పైగా విద్యార్థులను రవాణా చేస్తున్నారని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శనివారం నియమ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడు తున్న పాఠశాల యాజమాన్యంపై ఎందుకు చర్య తీసుకోకూడదో లికిత పూర్వకంగా వివరణ ఇవ్వాల్సిందిగా నోటీస్ జారీ చేసినట్లు డిఇఓ గోవింద రాజులు తెలిపారు. నోటీసు అందిన వెంటనే పాఠశాలపై పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు నడుచుకుంటే రూ.లక్ష జరిమానాతో పాటు పాఠశాల అనుమతులను రద్దు చేస్తామని డిఈఓ హెచ్చరించారు.పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే పాఠశాలలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో నిష్ణార్థులైన ఉపాధ్యాయులతో ఆంగ్ల మాధ్యమం కొనసాగుతుందని, పైసా ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా మెరుగైన ఆంగ్ల బోధన విద్యనందిస్తున్నామని, పట్టణాలకు చుట్టుపక్క గ్రామాల తల్లిదండ్రు