ప్రెస్‌క్లబ్‌పై దాడిని ఖండించిన సోమసుందర్
హైదరాబాద్, జనంసాక్షి: రుజువులేని ఉద్యమం పుస్తకావిష్కరణ సందర్బంగా ప్రెస్‌క్లబ్‌పై జరిగిన దాడిని ఏపీయుడబ్ల్యూజే అధ్యక్షుడు సోమసుందర్ బుధవారం ఖండించారు. వివాదాలు ఏమున్నా ప్రెస్‌క్లబ్‌పై దాడి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. నిషేధిత సంస్థలు కూడా ప్రెస్‌క్లబ్‌లో సమావేశాలు నిర్వహించుకుంటాయని ఆయన వెల్లడించారు. ప్రెస్‌క్లబ్‌పై దాడి తనతోపాటు ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి కూడా గాయపడ్డాడని సోమసుందర్ ఈ సందర్భండా తెలిపారు.