ప్రేమ జంట ఆత్యహత్యాయత్నం
ప్రియురాలి మృతి, ప్రియుడి పరిస్థితి విషమం
విజయవాడ, జూలై 20: మోపిదేవి మండలం పోలానితిప్ప గ్రామంలో ఒక ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రియురాలు మరణించగా, ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. అయితే వీరు స్థానికులు కాకపోవడంతో వారిని గుర్తించలేకపోయారు. శుక్రవారం ఉదయం చెరువు పక్కన వీరిద్దరు నురగలు కక్కుతూ పడివున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే 108 అంబులెన్స్‌తో సహా సంఘటన స్థలానికి రాగా, అప్పటికే యువతి మృతి చెందింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మోపిదేవి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతని పరిస్థితి ప్రమాదకరంగానే ఉన్నట్లు వైద్యుల సమాచారం, వీరు ఎక్కడివారన్నది తెలియాల్సి ఉందని, చుట్టు ప్రక్కల పోలీసు స్టేషన్లకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.