ప్రైవేటుకు దీటుగా విద్యనందించాలి
హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 3 (జనంసాక్షి) : ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువు తున్న విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందించాలని డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లు ఉపాధ్యా యులకు సూచించారు. హుజూరా బాద్ డిప్యూటీ డీఈవో పరిధిలోని పాఠశాలలో ఆంగ్ల భాషను బోధించే ఉపాధ్యాయులకు ఒక రోజు వృత్యం తర శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక ఎ మ్మార్సీభవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషకు ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ఆంగ్ల భాష ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచు కుని జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధి కారి, ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు అధికారి, డైట్ లెక్చరర్ల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడ లేని రీతిలో ఆంగ్ల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామన్నారు. గత సంవత్సరం జిల్లాలోని బాలిక పాఠశాలలో ప్రవేశపెట్టిన స్పోకెన్ ఇంగ్లిషు సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. ఈ విద్యా
సంవత్సరం నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలలకు స్పోకెన్ ఇంగ్లిషు కార్య క్రమాన్ని వర్తింపజేశారని ఆయన తెలిపారు. ఈ శిక్షణలో డివిజన్ పరి ధిలోని 16మండలాలకు చెందిన 281మంది ఆంగ్ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంగ్ల చార్టులు అందించాలి…
ప్రతి పాఠశాలకు ఆంగ్ల వ్యాకరణ అంశాలకు సంబంధించిన చార్టుల ను తయారుచేయించి అందించాలని డిప్యూటీ డీఈవోకు ఉపాధ్యాయ నేత లు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పాఠశాలలో సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రాలకు సంబంధిం చిన చార్టులు మాత్రమే అందించారని, మిగితా పాఠ్యాంశాలకు సంబంధించన ఆంగ్ల చార్టులు అందిస్తే విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యా య నేతలు సత్యప్రకాష్‌రావు, శ్రీనివాస్‌రావు, దేశ్‌ముఖ్, నర్సింహస్వామి, దామోదర్‌రెడ్డిలు పాల్గొన్నారు.