ప్రైవేటు పాఠశాలల దీటుగా ప్రభుత్వ పాఠశాలలు.

దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి.
 దౌల్తాబాద్ మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో శనివారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు బండారు దేవేందర్పంపిణి చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధనే కాకుండా దుస్తులు, నైపుణ్యాలను పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పడాల నగేష్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఎస్ఎంసి చైర్మన్ గడ్డం నాగరాజు, ఎల్లం , మహేందర్, రమేష్, ఎల్లం ,వెంకట్, ఉపాధ్యాయులు మల్లేశం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.