ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తాం; ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ టౌన్ ఆగస్టు 26 ( జనంసాక్షి )
తెలంగాణ ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని కోదాడ అభివృద్ధి ప్రదాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ జెడ్పిటిసి కృష్ణకుమారి శేషు నిధులు ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో గణపవరం,కూచిపూడి,నల్లబండగూడెం, కాపుగల్లు,ద్వారకుంట,తొగర్రాయి గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు సైన్స్ పరికరాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మన ఊరు మన బడి పథకం తో పాటు స్థానిక సంస్థల నిధుల వెచ్చించి ప్రైవేట్, కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామన్నారు.ప్రయోగాలతో పాఠాలు విద్యార్థుల కు సులభంగా అర్డంవుతాయన్నారు.గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాన్ని నిర్లక్ష్యం చేయన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాటశాలల్లో అన్ని సదుపాయాలు కల్పిసున్నామన్నారు.విద్యార్థు లు ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు సద్వినియోగం చేసుకొని ఉన్నత లాక్ష్యాలు సాధించాలన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న
టువంటి అవకాశాలను వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత లక్షల సాధించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు విద్యార్థులు ఉండే లక్ష్యాన్ని పెట్టుకొని లక్ష సాధన కోసం కృషి చెయ్యాలి అన్నారు.ఈ కార్యక్రమం
లో ఎంపీపీ కవిత రాధారెడ్డి, మండల విద్యాధికారి సలీం షరీఫ్, వైస్ ఎంపీపీ రాణి బ్రహ్మయ్య,ఆయా గ్రామాల సర్పంచులు లక్ష్మీనారాయణ,శెట్టి సురేష్ నాయుడు,
విజయకిరణ్,ఎంపీటీసీ శంకర్ శెట్టి కోటేశ్వరరావు,పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు,గ్రామ శాఖ అధ్యక్షులు అమరబోయిన శ్రీనివాస్ యాదవ్,ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డి వెంకటేశ్వర్లు,
బి.రాజు,గోవిందయ్య,ఉపేందర్ రావు,పవన్ కుమార్,సుధాకర్ రావు,విద్యా కమిటీ చైర్మన్లు,
ప్రజాప్రతినిధులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.