ప్రైవేట్ హాస్పిటల్ లో సీజేరియన్స్ చేయరాదు

-జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు నాయక్.
గద్వాల నడిగడ్డ, జులై 26 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రవేట్ ఆసుపత్రిలో సిజరిన్ చేయరాదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. చందు నాయక్ అన్నారు. మంగళవారము జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని గైనకాలజిస్ట్ డాక్టర్లందరికీ సి- సెక్షన్ (సిజేరియన్ ఆపరేషన్ లపై) ఆపరేషన్ లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్ /నర్సింగ్ హోమ్ నిర్వహించే గైనకాలజిస్ట్ డాక్టర్లందరూ సాధారణ కాన్పులు మాత్రమే చేయాలని, సిజేరియన్ ఆపరేషన్లను, చేయరాదని, ప్రోత్సహించరాదని, ఒకవేళ ప్రోత్సహించినట్లయితే , అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు.
కేవలం హైరిస్క్ గర్భిణీ స్త్రీలకు మాత్రమే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు చేయాలని , అవి కూడా మొత్తం కాన్పులలో 30 శాతం దాటకూడదని అన్నారు. సిజేరియన్ ఆపరేషన్ చేయడానికి గల కారణాలు, కేస్ షీట్ లో, వ్రాయలని అన్నారు. ప్రతినెల సి- సెక్షన్ ఆపరేషన్ లపై ఆడిట్, నిర్వహిస్తామని,హైరిస్క్ గర్భిణీ స్త్రీలను అందరిని ప్రభుత్వ ఆసుపత్రికి రెఫెర్ చేయాలని,ఈ సంవత్సరము ఏప్రిల్ -2022 నుండి జూన్ -2022 వరకు సి -సెక్షన్ ఆపరేషన్లు స్రవంతి హాస్పిటల్ లో ఎక్కువగా చేయడం వల్ల స్రవంతి హాస్పిటల్ నిర్వహించు యాజమాన్యం వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందనీ ఆయన అన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ఎస్. శశికళ, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది , టీ. వరలక్ష్మి, టీ. తిరుమలేష్ రెడ్డి,రామాంజనేయులు,గైనకాలజిస్ట్ డాక్టర్లు, డాక్టర్ శోభారాణి, డాక్టర్ కమలావతి, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ నలిని, డాక్టర్ అనురూప ,డాక్టర్ అశ్విని ,డాక్టర్ నర్మదా రెడ్డి ,డాక్టర్ హరిణి, డాక్టర్ దీప్తి పాల్గొన్నారు.