ప్రోటోకాల్ పాటించని అధికారులు టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్

జనం సాక్షి: నర్సంపేట
అధికార పార్టీ దాహంతో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి  డిప్యూటీ కలెక్టర్ గారి సమక్షంలో నర్సంపేట మున్సిపాలిటీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వము అఫీషియల్ గా చేసే ప్రోగ్రాంలో మున్సిపాలిటీ కౌన్సిలర్ లను అవమానపరుస్తూ వెనుక సీట్లలో కూర్చోబెట్టి ఏ హోదా లేని టిఆర్ఎస్ నాయకులను ముందు సీట్లో కూర్చోబెట్టడం మీ అధికార పార్టీ దాహానికి ఇది ఒక ఉదాహరణ అని టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ అన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన కౌన్సిలర్లను మీరు ఎమ్మెల్యే గా ఉండి ఏం చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు.. ఇకనైనా పార్టీలకతీతంగా ప్రజల కోసం తోడ్పడుతూ ప్రజా ప్రతినిధులను గౌరవించాలని ఎమ్మెల్యే ను డిమాండ్ చేశారు.
పార్టీలకు అతీతంగా పింఛన్లు కూడా అందరికీ అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు ఇక ఏడాది తరువాత  ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారు. ఎమ్మెల్యే గారు అందరిని ఒకే విధంగా చూడాలి పదవి వ్యామోహంతో ఎవరిని కనీసం పట్టించుకోవడంలేదని అన్నారు. ఇప్పటినుండి సహించేది లేదు ప్రజలకు ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.