ప్లాస్టికు వాడకం మానవాళికి ప్రమాదకరం. రాజాపూర్ గ్రామంలో విద్యార్థుల ర్యాలీ.
కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 23 కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై జడ్పీ ఎచ్ ఎస్ హైస్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.అదేవిధంగావీదుల గుండా ర్యాలీ నిర్వహించారు.విద్యర్థులు మాట్లాడుతూ ప్రజలు తమ విధిగా మార్కేటుకు వెళ్ళేటప్పుడు తమ తమ వెంట కాటన్ బ్యాగులను,కాగితం, బ్యాగులను తీసుకుపోవాలని ప్రజలకు వివరించారు.అదేవిధంగా ప్రజలు నిత్యావసర సరుకులను కొనుగోలు చేసేటప్పుడు ప్లాస్టీక్ కవర్లు వాడకూడదని విద్యార్థులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వాడకం వల్ల మనుషులకు జంతువులకు ప్రాణహాని వాటిల్లుతుందని విద్యార్థులు నినాదాలు ద్వారా తెలియజేశారు. బస్టాండ్ లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జడ్పీహెచ్ఎస్, హెచ్ఎం భాస్కర్ శర్మ, వెంకటప్ప, కొములయ్య, ఏ ఆంజనేయులు, మల్లికార్జున్, విద్యార్థులు, పాల్గొన్నారు.