ప్లాస్టిక్ నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే జరిమానా
ఖమ్మం,డిసెంబర్21(జనంసాక్షి): ప్లాస్టిక్ రహిత పంచాయితీల కోసం చేస్తున్నకృషిలో అందరూ కలసి రావాలని పంచాయితీ అధికారులు పిలుపునిచ్చారు. పారిశుధ్యాన్ని కాపాడేందుకు ప్రజలు సహకరించాలని అన్నారు. ఇళ్లల్లో దుకాణాల్లో, వివిధ ప్రాంతాల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, కొబ్బరి చిప్పలు రహదారుల వెంబడి పడేసేవారిని గుర్తించి చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీలో డంపింగ్ యార్డుల నిర్మాణం చేపడ్తున్నామని అన్నారు. గ్రామాల్లో సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులకు తరలించేందుకు స్వచ్ఛభారత్ గ్రావిూణ్ ద్వారా రిక్షాల పంపిణీ చేపడ్తున్నట్లు చెప్పారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల్లోనూ ప్లాస్టిక్ వినియోగాన్ని, ఫ్లెక్సీల వినియోగాన్ని నిర్మూలిస్తున్నట్లు చేపట్టారు. విక్రయదారులకు అందరికీ ఈ విషయమై హెచ్చరికలు జారీ చేశామన్నారు. గ్రామ పంచాయతీల్లో ఇళ్ల నమోదును కంప్యూటరీకరణ చేపడ్తున్నామని చెప్పారు.