ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం
ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం
కామారెడ్డి,జూలై8(జనంసాక్షి):ప్లాస్టిక్‌ను నిషేధించి ప్లాస్టిక్ రహిత బాన్సువాడగా నిర్మిద్దామని వ్యాపారస్తులు, ప్రజలకు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పిలుపునిచ్చారు. మనమంతా ప్రతిజ్ఞ తీసుకుని ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దామని అన్నారు. ముఖ్యంగా షాపుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపి వేయాలని కోరాఉ.. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో వ్యాపారస్తులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే చైతన్యం చేశామన్నారు. ప్లాస్టిక్ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. వ్యాపారస్తులు కొనుగోలు దారులకు వస్తువులను ప్లాస్టిక్ కవర్లలో అందించరాదన్నారు. ఎవరైనా ప్లాస్టిక్ వాడినట్లయితే రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.“