ఫలితాలు వచ్చిన వెంటనే ఈసీ నోటిఫికేషన్
హైదరాబాద్: శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతాయి. నియోజకవర్గాలవారీగా ఫలితాలను ప్రకటించిన తర్వాత రిటర్నింగు అధికారులు వాటన్నింటి ప్రతులను ఫ్యాక్స్‌లో హైదరాబాద్‌లోని ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కార్యాలయానికి పంపిస్తారు. మొత్తం 119 నియోజకవర్గాల ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణ సీఈవో వాటిని క్రోడీకరించి, మొత్తం ఫలితాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. అక్కడ ఆమోదం పొందిన వెంటనే సీఈవో ఎన్నికల ఫలితాలపై గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. ఈ నోటిఫికేషన్‌ను రాష్ట్ర గవర్నర్‌కు, శాసనసభాపతికి లేదా ఆయన కార్యాలయానికి పంపిస్తారు.