ఫసల్‌ బీమా యోజనలో వరి,మొక్కజొన్న,వేరుశనగ

జనగామ,నవంబర్‌29(జ‌నంసాక్షి): ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా అమలు చేస్తోంది. యాసంగి సాగు చేసే రైతులు తమ పంటలకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసు కోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కోరారు.  జనగామ జిల్లాలో బీమా పరిధిలోకి వరి, వేరుశనగ, మొక్కజొన్న పంటలు వస్తాయని, వరి పంటకు ఎకరానికి బీమా మొత్తం రైతు వాటాగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.  జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ఇప్పటికే జిల్లా వ్యాపితంగా ఫసల్‌బీమాపై ఏఈవోలు, రైతు సమన్వయ సమితి సభ్యుల ద్వారా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతులు అకాల వర్షాలు, వడగండ్ల వానలు వంటి ప్రకృతి వైఫరిత్యాలు సంభవించినప్పుడు పంట నష్టం జరిగిన రైతులను ఆదుకునేందుకు యాసంగి సీజన్‌కు అమలు చేస్తున్నట్లు  చెప్పారు.