ఫార్మా ప్రతినిధులతో కేటీఆర్‌ భేటి

4

న్యూఢిల్లీ,ఆగస్టు 19(జనంసాక్షి): ఢిల్లీ పర్యటనలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బిజీబిజీగా ఉన్నారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌.. ఫార్మా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.  శుక్రవారం రియల్‌ సదస్సులో పాల్గొన్న మంత్రి ఫార్మా ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ఫార్మా సిటీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి వారికి వివరించారు. పైజర్‌ ఇండియా, జాన్సన్‌ తదితర ఫార్మా కంపెనీల ఉన్నతస్థాయి ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటు, ఫార్మరంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ఫార్మా సిటీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి వారికి వివరించారు. ఫైజర్‌ ఇండియా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తదితర ఫార్మా కంపెనీల ఉన్నతస్థాయి ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ ను కలిశారు.