ఫిర్యాదుల పరిష్కారంలో బాధ్యతా యుతంగా వ్యవరించాలి.
ప్రజావాణికి జిల్లా అధికారులే హాజరు కావాలి.
జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 10(జనంసాక్షి):
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఒకింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా అధికారులే హాజరుకావాలని జిల్లా కలెక్టర్ టి.ఉదయ్ కుమార్ ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన వారి నుండి అర్జీలు స్వీకరించారు.సమస్యలు తెలిపేందుకు వచ్చిన వారి సమస్యలను ఓపికగా వినాల్సి న బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా అధికారులు హాజరుకాకుండా జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఔట్ సోరగ్ సిబ్బందిని పంపడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజావాణిలో తాము ఏమైనా పని పాట లేకుండా కూర్చున్నామా అని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
20 మండలాల్లో ప్రజావాణికి హాజరయ్యే జిల్లా అధికారుల మినహా మిగతా శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.జిల్లా అధికారి హాజరు కానిపక్షంలో తదుపరి క్యాడర్ అధికారి,లేదా సూపరింటెండెంట్ మాత్రమే హాజరు కావాలని ఆదేశించారు.ఈ విషయం లో ఎంత మాత్రం నిర్లక్షం తగదని హెచ్చరిం చారు.ఈ సందర్భంగా 25 అర్జీలు అందాయ న్నారు. వీరంతా నేరుగా జిల్లా కలెక్టర్ ని కలిసి సమస్యలు వివరించారు.ఈ కార్య క్రమంలో అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్, సిపిఓ భూపాల్ రెడ్డి పిడిడిఆర్డిఏ నర్సింగ్ రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.