ఫీజుల దోపిడీని అరికట్టాలి

కడప,జూలై7(జ‌నం సాక్షి):కార్పొరేట్‌, ప్రయివేటు విద్యా సంస్థలు విచ్చల విడగా దందాను కొనసాగిస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ అన్నారు.కార్పొరేట్‌, ప్రయివేటు విద్యా సంస్థలు విద్యార్థుల వేటలో కొనసాగుతూ ఉంటే విద్యాశాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఆయన అన్నారు. కనీసం పట్టణంలో ఉన్న పాఠశాలలు ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచుకొంటూ పోతున్నారు. విద్యాహక్కు చట్టాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారన్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, టై, బెల్ట్‌, రకాల పేర్లతో తల్లిదండ్రులకు టోపి పెడుతున్నారని విమర్శించారు. ఫీజుల పట్టికను పాఠశాల ముందు నోటీసు బోర్డులో ఏర్పాటు చేయాలని లేకుంటే ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు.