ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమేవిడుదల చేయాలి.

బీసీవిద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్.రాజన్న సిరిసిల్ల అక్టోబర్ 31. (జనం సాక్షి).విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిఫ్ లు ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ గారి అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థిని విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు మరియు ఫిజియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు 3000 కోట్ల రూపాయల పెండింగు లో ఉన్నాయని అన్నారు. విడుదల చేయని కారణంగా ఎంతోమంది పేద విద్యార్థులు చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ ఫీజులు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయలేదని అన్నారు . రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్లలో బీసీ హాస్టల్ కి పక్కా భవనాలు లేవని అన్నారు పక్కా భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే బీసీ హాస్టల్లో పక్కాభవనాలని మంజూరు చేయాలని కోరారు హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు ప్రతి మండల కేంద్రంలో ఫీజు యాత్రతో విద్యార్థిని విద్యార్థులతో కలిసి మండల ఆఫీసులను ముట్టడిస్తామని అన్నారు వారం పది రోజులలో ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్, మండల అధ్యక్షులు మట్ట నరేష్ ,బీసీ హాస్టల్ అధ్యక్షులు నవీన్ ,నాయకులు, పోతర్ల వంశీ, పోతర్ల గణేష్, అల్లే నీరజ్, దొరగాండ్ల వినీత్ ,దుబ్బాక అజయ్ ,బత్తిని రోహిత్, అడగొప్పుల జగన్ ,విజయ్, సిద్ధార్థ ,మనోజ్, కార్తీక్, లక్ష్మణ్, రాజకుమార్ ,విద్యార్థి నాయకులు పాల్గొన్నారు

తాజావార్తలు