ఫైలేరియా ప్రబలకుండా దోమల నివారణకు మండల వ్యాప్తంగా పారిశుద్ధ్యత పనులు చేపట్టాలి. – ఎంపీపీ లింగాల నిర్మల.

బెజ్జంకి,అక్టోబర్20,(జనం సాక్షి):మండల కేంద్రంలోని తోటపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో,హరీష్ రావు కాలనీ లో పైలేరియా నివారణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ లింగాల నిర్మల పాల్గొని 2 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికీ డిఈసి మాత్రలను పంపిణీ చేశారు.అనంతరం ఎంపీపీ లింగాల నిర్మల మాట్లాడుతూ ముఖ్యంగా ఫైలేరియా వ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.పైలేరియా ప్రబలకుండా దోమల నివారణకు గ్రామాలు,మండల వ్యాప్తంగా పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు.ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్త తీసుకోవాలన్నారు,పైలేరియా వ్యాధి రాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు,ఎంపీటీసీ నల్లగొండ లక్ష్మి నర్సయ్య,ఉప సర్పంచ్ ఎంబరి మమత సతీష్,వైద్యాధికారి కీర్తి,తెరాస మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్,తెరాస యువజన విభాగం మండల అధ్యక్షులు బిగుల్ల మోహన్,నాయకులు అమ్మిగల్ల సురేష్,మడ్డి సందీప్,అనిల్,నాగరాజు,రాకేష్,ఆశాలు పాల్గొన్నారు.