ఫోటోగ్రాఫర్ మండల అధ్యక్షుడు జక్కని గంగ ప్రసాద్

జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండలంలోని ఫోటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నాలుగోసారి జక్కని గంగ ప్రసాద్ నియమింపబడ్డట్లు మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ తెలిపారు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ యూనియన్ అభ్యున్నతికి కృషి చేస్తానని, మండలంలోని ఫోటోగ్రాఫర్ లందరూ ఐక్యమత్యంతో ఉండాలని కోరారు. ఈ కార్యవర్గంలో ఉపాధ్యక్షుడు తూర్పాటి రాజేష్, కోశాధికారి తుమ్మ నరేష్ లు ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమంలో తూర్పాటి సతీష్, శేఖర్, విశ్వనాథం, రామ్మోహన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు