ఫోటో రైటప్ : ధర్నా చేస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులు

జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 26 , ( జనం సాక్షి) :
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూత్ కాంగ్రెస్ జిల్లాఅధ్యక్షుడు బనుక శివరాజ్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నియోజకవ ర్గ కేంద్రంలోని ప్రభుత్వజూనియర్ కాలేజ్ ఆవరణ లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1654 గెస్ట్ లెక్చరర్ రెన్యువల్ కొరకు, అదేవి ధంగా కాంట్రాక్ట్ లెక్చరర్లక్రమబద్ధీకరణకొరకు,ప్రభు త్వ జూనియర్ కాలాశాలలో ఉన్న లెక్చరర్ల కోరత భర్తీ కొరకు, పేద విద్యార్థుల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలనే ఉద్దేశంతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. అనంత రం ప్రిన్సిపాల్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికైనా స్పందించి పైన తెలిపిన పలు సమస్యలను వెంటనే పరిష్కరించి అమలు చేసి కాంట్రాక్టు లెక్చరర్ లకు విద్యార్థులకు న్యాయం చేయాలని యూత్ కాంగ్రెస్ తరపున డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బనుక శివరాజ్ యాదవ్, నియోజకవ ర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోరుకొ ప్పుల మధు గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్య క్షుడు ఐలపాక శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్య క్షుడు తాటికాయల రాజేందర్, మండల యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మారపాక వసంత్, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ యాదవ్, రాకే ష్, జోగు రామచందర్,శోభన్ బాబు,రాజేష్,రాజు  విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.