ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా మళ్ళీ కలిసిపోయిన భార్యాభర్తలు

-ఇన్స్పెక్టర్ సీతయ్య*
మక్తల్ జూలై 09 (జనంసాక్షి) జిల్లా ఎస్పీ శ్రీ ఎన్ వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లాలో సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయబడిన నాలుగు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లలో మొత్తం 08 పిటిషనర్లు కౌన్సిలింగ్ కొరకు రావడం జరిగింది. వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మక్తల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లో శ్రీమతి మంజుల w/o వీరేష్, కృష్ణా మండలంలోని ఐనాపురం గ్రామానికి చెందిన మంజుల రైచూర్ కు చెందిన వీరేష్ ని మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకోవడం జరిగింది. వారికి ఒక సంవత్సరం బాబు ఉన్నాడు. ఐదు నెలల క్రితం భార్యాభర్తలు గొడవపడి భర్త కట్టిన తాళి తెంచివేయడం వల్ల మంజుల తన తల్లి గారి ఇంటికి వెళ్లిపోవడం జరిగింది.  ఇరువురు కృష్ణ పోలీస్ స్టేషన్ వెళ్లగా  SI. సూచన మేరకు వారు కౌన్సెలింగ్ కొరకు మక్తల్ సర్కిల్ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. ఈ రోజు మక్తల్ సీఐ సీతయ్య గారు, SI రాములు, అడ్వకేట్ నాగేశ్వరి, మహిళా పోలీసులు వారిరువురికి పాలు మార్లు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కౌన్సిలింగ్ అనంతరం భార్యాభర్తలు ఇరువురు  రాజీపడి అందరి సమక్షంలో మళ్లీ తాళి కట్టి వీరేష్ తన భార్య అయిన మంజులను ఇంటికి తీసుకెళ్లడం జరిగింది అని సిఐ సీతయ్య గారు తెలిపారు.