ఫ్రీడమ్ రన్ కు నీరాజనం పట్టిన పురజనులు .
జనగామ (జనం సాక్షి) ఆగస్టు 11.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నాలుగో రోజు రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ వరకు కొనసాగిన ఫ్రీడం రన్ కు పట్టణ ప్రజలు అధికారులు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మహిళలు యువత జాతీయ పతాకాలతో మది నిండా జాతీయ సమైక్యతను నింపుకొని …జై జై మాత… భారత మాత…జాతీయ పతాకాలను చేతపుచ్చుకొని ఎగురవేస్తూ జై జవాన్ …జై కిసాన్ …. అంటూ వంటి నినాదాలతో ఫ్రీడం రన్ లో పాల్గొనడంతో మరోమారు పట్టణం మారుమోగింది.పట్టణంలోని వీధులన్నీ పోలీసు అధికారులు తమ ఆధీనంలో తీసుకొని ట్రాఫిక్కుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.పట్టణమంతా పరిశుభ్రంగా తీర్చిదిద్ది రన్ కు ఎటువంటి ఆటంకాలు కలగకుండా మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు.ఈ జాతీయ సమైక్యత స్ఫూర్తి నిస్తున్న కార్యక్రమానికి రైల్వే స్టేషన్ వద్ద జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి డిసిపి సీతారాం మున్సిపల్ చైర్మన్ పోకల జమున అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ల తో కలిసి జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఫ్రీడం రన్ ను ప్రారంభించారు.
కలెక్టర్ తో పాటు శాసనసభ్యులు డిసిపి మునిసిపల్ చైర్మన్ వంటి పలువురు ప్రముఖులు అధికారులు రన్ లో పాల్గొని ప్రతి ఒక్కరిలో జాతీయ సమైక్యత స్ఫూర్తి రగిలించారు.
ఈ ఫ్రీడమ్ రన్ లో జెడ్పి సీఈవో విజయలక్ష్మి ఆర్డీవో మధుమోహన్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు యువత మహిళలు తదితరులు పాల్గొన్నారు.