ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ(మేట్పల్లి) నిరుపేద వృద్ధురాలుకు బియ్యం పంపిణీ

మల్లాపూర్,(జనంసాక్షి)జులై :17 మండలంలోని రాఘవపేట గ్రామంలోని నిరుపేద వృద్ధురాలు అయిన గాండ్ల అమృత నివాసం ఉంటున్న ఇంటిలోకి ఇటీవల కురిసిన అకాల వర్షానికి నీరు ఇంటిలోకి రాగ ఇంట్లో ఉన్న నిత్యవసర వస్తువులన్నీ తడిసి పోగా ఈ నిరుపేద వృద్ధురాలు అయిన అమృత యొక్క బాధని చూసి చలించిపోయి ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ మెటుపల్లి వారు నిత్యావసర వస్తువులు, బియ్యం పంపిణీ చేయడం జరిగింది.

అనంతరం నిరుపేద వృద్దులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసినందుకు గాను గ్రామ సర్పంచ్ నత్తి లావణ్య నర్సయ్య,Trs పార్టీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ నాయకులు సుద్దు రాజు,బండి రాజు,ఒడ్డం సంతోష్ మరియు పలువురు గ్రామస్తులు ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ వారిని అభినందించారు..