ఫ్రెడ్డీ పంచ్ పవర్ అరంగేట్రంలోనే అదరగొట్టిన ఫ్లింటాఫ్
న్యూయార్, డిసెంబర్ 1: ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ బాక్సింగ్ రింగ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత బాక్సర్‌గా మారిన ఫ్లింటాఫ్ గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా అమెరికాలో జరుగుతోన్న హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌తో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో అమెరికా బాక్సర్ రిచర్డ్ డాసన్‌పై విక్టరీ కొట్టాడు. మ్యాచ్ ప్రారంభం నుండే ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించాడు. అతని జోరుకు డాసన్ తాళలేకపోయాడు. రెండో రౌండ్‌లో కాస్త ప్రతిఘటించినా… టెక్నికల్ పాయింట్ల పరంగా ఫ్లింటాఫ్‌దే పై చేయిగా నిలిచింది. 34 ఏళ్ళ ఫ్రెడ్డీ గత కొంత కాలంగా మాజీ హెవీవెయిట్ ఛాంపియన్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్‌గా అతనికిదే తొలి ఫైట్. అటు మాజీ ఆటగాడు డారెన్ గాఫ్ ఈ మ్యాచ్‌కు హాజరై ఫ్లింటాఫ్‌కు మధ్ధతిచ్చాడు.