ఫ్లింటాఫ్‌ బాక్సింగ్‌ ఎంట్రీ రేపే పంచ్‌ పవర్‌ చూపేందుకు సిద్ధమైన మాజీ బౌలర్‌

యుఎస్‌ఎ,నవంబర్‌29

ఒకప్పుడు తన బౌలింగ్‌తో క్రికెట్‌లో గ్రౌండ్‌లో సత్తా చాటి న ఇంగ్లాండ్‌ ప్లేయర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్‌ ప్రారం భించాడు. ప్రత్యర్థు లపై పంచ్‌ల వర్షం కురిపిం చేందుకు సిధ్దమయ్యాడు. స్వతహాగా బాక్సింగ్‌ అంటే ఆసక్తి ఉన్న ఫ్లింటాఫ్‌ గత కొంత కాలంగా దానిని ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. అంత ర్జాతీయ క్రికెట్‌ నుండి వైదొలిగిన తర్వాత పూర్తిగా ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా మారిన ఈ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ రేపు అరంగేట్రం చేయబోతున్నాడు. అమెరికాలో జరగనున్న ఛాంపియన్‌షిప్‌లో రిచర్డ్‌ డాసన్‌తో తలపడబోతున్నాడు. 34 ఏళ్ళ ఫ్రెడ్డీకి ఇదే తొలి ప్రొఫెషనల్‌ బౌట్‌. నాలుగు రౌండ్ల హెవీవెయిట్‌ కాంటెస్ట్‌లో ఫ్లింటాఫ్‌ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. గత ఐదు నెలలుగా ఫ్లింటాఫ్‌ మాజీ వరల్డ్‌ ఛాంపియన్‌ బ్యారీ మెక్‌గుగాన్‌ దగ్గర మెళుకువలు నేర్చుకున్నాడు. క్రికెట్‌ కంటే బాక్సింగ్‌ నేర్చుకోవడమే కష్టమైందని ఫ్లింటాఫ్‌ చెప్పాడు.ఫ్లింటాఫ్‌ ఇంగ్లాండ్‌ యాషెస్‌ సిరీస్‌ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటించి బాక్సింగ్‌కు దగ్గరైన ఫ్రెడ్డీ ఇప్పట్లో టెలివిజన్‌ కామెంటేటర్‌గా వచ్చే ఉద్ధేశం లేదని చెప్పాడు.