బంగారుతెలంగాణలో భాగస్వామ్యంకండి

4

– స్పీకర్‌ మధుసూధనచారి

– అసెంబ్లీ ఉద్యోగులకు క్రీడా పోటీలు

హైదరాబాద్‌,మే30(జనంసాక్షి):బంగారు తెలంగాణ సాధనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అసెంబ్లీ స్పీకర్‌ మధుసూధనాచారి పిలుపునిచ్చారు.రాష్ట్రావతరణ వేడుకలను అసెంబ్లీ ఆవరణలో ఘనంగా నిర్వహిస్తామని స్పీకర్‌ మధుసూధనాచారి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా అసెంబ్లీ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఈ స్పోర్ట్స్‌విూట్‌ను తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, సభాపతి మధుసూదనాచారి, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇబ్బందులు పడ్డ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ప్రజలంతా మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం క్రీడాకారులతో కరచాలనం చేసి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌, మధుసూదనాచారి ఉద్యోగులతో కలిసి కబడ్డీ ఆడుతూ అందరి దృష్టినీ ఆకర్షించారు. మహిళా ఉద్యోగులకు కుర్చీ ఆటలు నిర్వహించారు. ఈ స్పోర్ట్‌ విూట్‌లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌ సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.